టీటీడీ చైర్మన్ ను కలసిన కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్
తిరుపతి, నవంబర్ 15:

తిరుమల తిరుపతి దేవస్థానముల చైర్మన్ బీయర్ నాయుడు ను రాష్ట్ర కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తోట వాసుదేవ్ రాయల్ శనివారం తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ ను కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసు దేవ్ రాయల్ శాలువ తో ఘనంగా సత్కరించారు. తోట వాసుదేవ్ రాయల్ డైరెక్టర్ గా పదిమందికి ఉపయోగపడేలా మంచి పనులు చేయాలని సూచించారు. అలాగే భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని చైర్మన్ బిఆర్ నాయుడు ఆకాంక్షించారు. వాసుదేవ్ రాయల్ తో పాటు శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు కూడా టీటీడీ చైర్మన్ ను కలిసిన వారిలో ఉన్నారు.
