టిడిపిలో పనిచేసే వారికే నామినేటెడ్ పదవులు….
రాష్ట్ర డైరెక్టర్లకు జెబి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మానం…
తిరుపతి, నవంబర్ 14:

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసే వారికి వాటంతట అవే నామినేటెడ్ పదవులు వరిస్తాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నేత జెబి శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన తోట వాసుదేవ రాయల్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఎస్విఎం శ్రీధర్ లను శుక్రవారం జేబీ శ్రీనివాస్ కార్యాలయంలో జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జేబి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అని, పార్టీలో కష్టపడి పని చేసే వారికి పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులలో తగిన ప్రాధాన్యత కల్పిస్తారని చెప్పారు. రాబోయే రోజుల్లో వారిద్దరూ మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో టిడిపి నేతలు రాజేష్, రఘురాం, జగదీష్, కాలేషా
జేబీ శ్రీనివాస్ యువత నాయకులు పాల్గొన్నారు.
