కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్ డ్రా చేసుకున్న నాగార్జున

TG: సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ ఇటీవల క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె పై వేసిన పరువునష్టం కేసును ఆయన విత్ డ్రా చేసుకున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు తెలియజేశారు. సమంత విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనం రేపాయి. దీంతో నాగార్జున ఆమెపై పరువునష్టం దావా వేశారు.
