
* పెద్దిరెడ్డి అడవి కబ్జా ? హెలికాఫ్టర్ నుంచి పవన్ వీడియో-మిథున్ రెడ్డి కౌంటర్..!* గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా మంగళం పేట అడవుల్లో అటవీ భూమిని ఆక్రమించుకున్న వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం కమ్ అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్ నుంచి వీడియో తీసారు. తాజాగా చిత్తూరు అడవుల్లో పర్యటించిన పవన్.. అక్కడ టూర్ కు వెళ్లిన సందర్భంగా స్వయంగా షూట్ చేసిన ఈ వీడియోను ఎడిటింగ్ చేసి ఇవాళ విడుదల చేశారు. ఈ వీడియో కలకలం రేపుతుండటంతో పెద్దిరెడ్డి కుమారుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన తూర్పు కనుమలలోని రక్షిత మంగళం పేట అటవీ భూముల్లో 76.74 ఎకరాల అక్రమ ఆక్రమణలు జరిగినట్లు ప్రత్యేక ఏరియల్ సర్వేలో వెల్లడైందంటూ పవన్ ఇవాళ వెల్లడించారు. తాను స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఉల్లంఘనలను సమీక్షించానన్నారు. అలాగే సీఎం చంద్రబాబు, క్యాబినెట్ మంత్రులకు సమాచారం అందించానన్నారు. అలాగే వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించారు.అడవి భూమిని లాక్కున్న ఎవరికైనా మినహాయింపులు లేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పవ
