Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

అరణియార్ లో ఏడు సార్లు చేప పిల్లలు వదలడం అదృష్టంగా భావిస్తున్నా

*అరణియార్ లో ఏడు సార్లు చేప పిల్లలు వదలడం అదృష్టంగా భావిస్తున్నా*

✍️ *మత్స్య కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం*

✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*

✍️ *గురువారం ఎమ్మెల్యే చేతులు మీదుగా 6 లక్షలు చేప పిల్లలు విడుదల*

✍️ *ఈ నెల 18 తరువాత జలాశయంలో మరో 4 లక్షలు చేప పిల్లలు*

అరణియార్ లో ఏడు సార్లు చేప పిల్లలు వదలడం అదృష్టంగా భావిస్తున్నా

అరణియార్ రిజర్వాయర్ లో వరుసగా ఏడు సార్లు చేప పిల్లలు వదలడం తన అదృష్టంగా భావిస్తున్నాని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంతోషం వ్యక్తం చేశారు.

 

గురువారం ఉదయం పిచ్చాటూరు అరణియార్ పాత గేట్ల వద్దకు ఎమ్మెల్యే ఆదిమూలం చేరుకొని, అధికారులు, మత్స్య కార్మిక సంఘం నేతలతో కలిసి 6 లక్షల చేప పిల్లలను తొలివిడత గా జలాశయంలో వదిలారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మత్స్య కార్మికులు సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మించిన నాటి నుండి వరుసగా ఏడు ఏళ్ల పాటు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం, ప్రతి ఏటా 10 లక్షలు చొప్పున ఇప్పటి వరకు 66 లక్షల చేప పిల్లల వదిలి రికార్డు సృష్టించిన ఘనత తనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు.

 

ఈ ఏట వదలాల్సిన మిగిలిన 4 లక్షలు చేప పిల్లలు సైతం ఈ నెల 18 తరువాత జలాశయంలో వదలనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

 

ఇలా ప్రాజెక్టులో చేపలు పెంపకం వల్ల ద్వారా ప్రత్యక్షంగా 2 కుటుంబాలకు, మరోక్షంగా మరో వెయ్యి కుటుంబాలకు జీవనోపాధి కలుగుతోందని ఎమ్మెల్యే వెల్లడించారు.

 

వరదలు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ పొందిన మత్స్యకార్మిక కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులను మంజూరు అయ్యిందని, వాటిని త్వరగా పంపిణీ చేయాలని జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి శాంతి, స్థానిక తహశీల్దారు సుబ్రమణ్యం లను ఎమ్మెల్యే ఆదేశించారు.

 

అలాగే తమకు సబ్సిడీకి వలలు, బోట్లు, సైకిళ్లు పంపిణీ చేయాలని అరణియార్ మత్స్య కార్మికులు ఎమ్మెల్యే ఆదిమూలం ఎదుట ఏకరువు పెట్టారు. అధికారుల ద్వారా తప్పక నివేదిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

 

*జైకా నిధులతో అరణియార్ ఆధునికీకరణ : ఎమ్మెల్యే*

 

జపాన్ ఇండస్ట్రీస్ కో ఆపరేటివ్ అసిస్టెన్స్(జైకా) నిధులు రూ.35 కోట్లతో గతంలో ప్రారంభించిన పనులు పదిశాతం మాత్రమే పూర్తి చేసి కాంట్రాక్టర్ చేతులెత్తేశారని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు.

 

ఇంకా రూ.28 కోట్లు మిగిలి ఉందని, గత కాంట్రాక్ట్ ను రద్దు చేసి, ఈ నిధులకు మళ్లీ టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపట్టాలని, ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి, ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

 

ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ ప్రక్రియ పై దృష్టి సారించాలని, అరణియార్ ను పూర్తి స్థాయిలో ఆధునికీకరించి ఈ ప్రాంత అన్నదాతలను, మత్స్య కార్మికులను ఆదుకోవాలని ఎమ్మెల్యే ఆదిమూలం కోరారు.

 

ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ శాంతి, ఎఫ్.డి.ఓ మధుసూదన్, అంజర్వర్ పి. రవికుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా మత్స్య కార్మిక సంఘం అధ్యక్షుడు రత్నం, ఇరిగేషన్ డీఈ శ్రీనివాసులు, ఎంపిడిఓ మహమ్మద్ రఫీ, ఏఎంసీ మాజీ చైర్మన్ డి ఇలంగోవన్ రెడ్డి, అరణియార్ ఆయకట్ట చైర్మన్ రవి రెడ్డి, అరణియార్ మత్స్య కార్మిక సంఘం చైర్మన్ ఎత్తిరాజు రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related posts

గిరిజనుల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంప్

Garuda Telugu News

తిరుచానూరు పవిత్రతను కాపాడండి

Garuda Telugu News

పిచ్చాటూరులో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశ

Garuda Telugu News

Leave a Comment