Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

లక్ష్ట్యాన్ని నిర్దేశించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగండి

*లక్ష్ట్యాన్ని నిర్దేశించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగండి.*

– *జాగృతి యాత్రికులకు శ్రీసిటీ ఎండీ దిశానిర్దేశం.*

శ్రీసిటీ, నవంబర్ 13, 2025:

👉లక్ష్ట్యాన్ని నిర్దేశించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న మీ కలలను సాకారం చేసుకోండంటూ జాగృతి యాత్రికులకు శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి దిశానిర్దేశం చేశారు. జాగృతి యాత్ర దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా బుధవారం 525 మంది యువ యాత్రికులు శ్రీసిటీ చేరుకున్నారు. వీరు రోల్ మోడల్ గా ఎంచుకున్న డాక్టర్ సన్నారెడ్డి బుధవారం రాత్రి శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సభ్యులతో సమావేశమై స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.

 

👉1990 దశకంలో అమెరికాలో మొదలైన తన పారిశ్రామిక ప్రయాణం భారతదేశంలో శ్రీసిటీగా ఎలా విస్తరించిందో వివరించారు. షెన్‌జెన్, జురాంగ్ వంటి ప్రపంచ స్థాయి పారిశ్రామిక నగరాల ప్రేరణతో “వర్క్, లివ్, లెర్న్, ప్లే” విధానంతో ప్రపంచ వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దిన తీరును ప్రస్తావించారు.

 

👉2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఒక ఎదురుదెబ్బగా అందరూ భావించారు. పునఃనిర్మాణానికి ఉత్ప్రేరకంగా శ్రీసిటీ స్పందించింది. సెజ్ గా మొదలైన ప్రస్థానం, పరిమాణక్రమంలో పలు మార్పులతో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) తో పాటు, దేశీయ టారిఫ్ జోన్ (డీటీజెడ్), ఫ్రీ ట్రేడ్ వేర్‌హౌసింగ్ జోన్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌ లుగా అభివృద్ధి చెందిందన్నారు. శ్రీసిటీ సమ్మతి-ఆధారిత భూసేకరణ నమూనాను హైలైట్ చేస్తూ, ఇది ఆదర్శవంతమైన నమూనాగా జాతీయ విధానాన్ని ప్రభావితం చేసిందని చెప్పారు.

 

👉నేడు 31 దేశాలకు చెందిన 240 కి పైగా కంపెనీలకు నిలయమైన శ్రీసిటీ, ₹44,500 కోట్ల పెట్టుబడులు, ₹51,500 కోట్ల ఎగుమతులు చేపట్టిందని వెల్లడించారు. 65,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించ గలిగామని, అందులో సగానికి పైగా మహిళలు ఉండడం పట్ల గర్వపడుతున్నామని తెలిపారు. శ్రీసిటీ స్థాపన నుంచే నైపుణ్య కేంద్రాలు, వృత్తి శిక్షణ కేంద్రాల ద్వారా స్థానిక జీవనోపాధికి దోహదపడిన తీరుని వివరించారు. నమ్మకం, చిత్తశుద్ధి, స్థిరమైన ధోరణితో చిన్నగా మొదలుపెట్టి పెద్ద మార్పును సాదించవచ్చన్న సత్యానికి శ్రీసిటీ ఒక నమూనాగా పేర్కొన్నారు. చివరగా ప్రశ్నోత్తరాల సెషన్ లో సభ్యుల పలు సందేహాలను నివృత్తి చేశారు.

 

👉సమావేశం ప్రారంభంలో శ్రీసిటీ డైరెక్టర్ (సిఎస్ఆర్) నిరీషా సన్నారెడ్డి జాగృతి యాత్ర బృందానికి సాదర ఆహ్వానం పలికారు. జాగృతి యాత్రి సీఓఓ చిన్మయ్ వాడ్నేటే ప్రశ్నోత్తరాల కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Related posts

టిడిపి నేత శంకర్ భౌతికకాయానికి ఎమ్మెల్యే నివాళి

Garuda Telugu News

కొత్తగా నిర్మించబడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాగలాపురం మండల ఎంపీపీ సింధు శ్యామ్ చేతులమీదుగా గజమాలలు

Garuda Telugu News

దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక

Garuda Telugu News

Leave a Comment