Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

విశాఖ సమ్మిట్‌లో కార్మికుల సంక్షేమంపై చర్చించండి   వి.శ్రీనివాసరావు డిమాండ్‌

*విశాఖ సమ్మిట్‌లో కార్మికుల సంక్షేమంపై చర్చించండి*

*వి.శ్రీనివాసరావు డిమాండ్‌*

*రాష్ట్రాభివృద్ధికి వచ్చే పెట్టుబడులను సిపిఎం ఆహ్వానిస్తుంది*

*రైతులకు, ప్రజలకు నష్టం చేస్తే ఊరుకోం*

*విశాఖ సిఐఐ సమ్మిట్‌లో ఉపాధి, ఉద్యోగాల కల్పన, కార్మిక సంక్షేమంపైనా ప్రత్యేకంగా చర్చ జరగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.* *మంగళవారం విజయవాడ బాలోత్సవభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కె.ప్రభాకరరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్టుబడుల సదస్సులు పేరుతో జరిగేవన్నీ ప్రభుత్వం, కార్పొరేట్ల భాగస్వామ్యంగా ఉంటున్నాయి తప్ప ప్రజల భాగస్వామ్యానికి చోటు ఉండటం లేదని అన్నారు.*

 

*గతంలోనూ అనేక సదస్సులు జరిగాయని, వాటిద్వారా ఉపాధి ఎంత వచ్చిందో బయటపెట్టాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వచ్చే పెట్టుబడులను సిపిఎం ఆహ్వానిస్తుందని చెప్పారు. గతంలో పెట్టు బడులు వచ్చాయని పెద్దఎత్తున ప్రచారం చేసినా ఉపాధి పెరగలేదని, స్థానికులకు పనులు దొరకలేదని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా స్టీలు ప్లాంటులో ఆరువేల ఉద్యోగాలను తీసేశారని తెలిపారు.*

 

*ఇప్పటికే విశాఖ ఐటి భవనాలు పరిశ్రమలు రాక ఖాళీగా ఉన్నాయన్నారు. గంగవరం పోర్టులో స్థానికులను తీసుకుని తరువాత తొలగించారని అన్నారు. లెక్కల్లో చూపించడానికే ఇలాంటిది చేశారని పేర్కొన్నారు. నిజంగా అభివృద్ధిని కోరుకుంటే ప్రజలను, కార్మికులను అన్నింటిలో భాగస్వాములను చేయాలని అన్నారు. అప్పుడే పెట్టుబడుల సదస్సు లకు విలువ ఉంటుందన్నారు.* *కేవలం కార్పొరేట్ల కోసమే సదస్సులు నిర్వహించేలా ప్రభుత్వం వ్యవహరించకూడదని, రాష్ట్రం, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు.*

 

*బాంబ్‌ బ్లాస్ట్‌ కారకులకు కఠినంగా శిక్షించాలి*

 

*ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో బాంబ్‌ బ్లాస్ట్‌ ఘటనలో మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని చెప్పారు. ఈఘాతుకానికి కారకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు..* *ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ఇంటిలిజెన్స్‌, రాజకీయ వైఫల్యం ఉందని తెలిపారు. పుల్వామా, పెహల్గాంతోపాటు అనేకచోట్ల ఉగ్రదాడులు జరిగాయని వీటిని గుర్తించడంలోనూ ప్రజల ప్రాణాలు కాపాడటంతోనూ కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. పెహల్గాం ఉగ్రవాదులను ఇప్పటి వరకూ పట్టుకోలేదని పేర్కొన్నారు. సర్టికల్‌ స్ట్రైక్స్‌ చేశామని, ఉగ్రవాదాన్ని అంతమొందించామని బిజెపి ప్రచారం చేసుకుంటోంది మినహా వాస్తవంగా అణచివేయలేదని పేర్కొన్నారు. ఉగ్రదాడులు జరుగుతాయనే సమాచారంతో తనిఖీలు చేస్తున్న కేంద్రం ముందుగానే వాటిని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు.* *ఇలాంటి సమయాల్లో మతాన్ని టార్గెట్‌ చేసుకుని ప్రచారం చేయడం వల్ల వైషమ్యాలు పెరుగుతున్నాయి మినహా ఉగ్రవాదం తగ్గదని చెప్పారు.. ఇప్పటికైనా కేంద్రం స్పందించి అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉగ్రవాద నివారణకు అవసరమైన సలహాలు సూచనలు తీసుకుని వాటిని అమలు చేయాలని కోరారు.*

 

*నష్టపోయిన రైతులకు పరిహారం ఎగ్గొట్టేలా చర్యలు : కె. ప్రభాకర రెడ్డి*

 

*మొంథా తుఫానులో నష్టపోయిన రైతులకు పరిహారం ఎగ్గొట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకరరెడ్డి అన్నారు.* *పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని తొలుత చెప్పిన ప్రభుత్వం ఎన్యుమరేషన్లో తగ్గించుకుంటూ వస్తోందని అన్నారు. వరి, అరటి, మొక్కజన్న, పసుపు వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఎన్యుమరేషన్‌ సమయంలో రైతుల సంఖ్యను తగ్గిస్తున్నారని తెలిపారు.*

 

*గతంలో ఉచిత పంటల బీమా వల్ల రైతులకు ఉపయోగం కలిగందని, ప్రస్తుతం అది లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. అలాగే సిసిఏ అనుసరిస్తున్న విధానం వల్ల పత్తిరైతులకు అన్యాయం జరుగుతోందని, నిబంధనలు మార్చాలని డిమాండు చేశారు. మొక్కజన్న రైతులను ఆదుకోవాలని కోరారు. పంటలు దెబ్బతిన్న రైతులు, కౌలు రైతులు అందరినీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.*

Related posts

మా ఎమ్మెల్యేను విమర్శిస్తే పుట్టగతులు ఉండవు

Garuda Telugu News

LIC: ఎల్‌ఐసీ పాలసీ ఉన్న వారికి హెచ్చరిక.. బీమా సంస్థ కీలక ప్రకటన

Garuda Telugu News

అన్నప్రసాదాలలో అదనంగా ‘వడ’ ప్రసాదంను పంపిణీ చేసిన టిటిడి ఛైర్మన్ 

Garuda Telugu News

Leave a Comment