పోషక ఆహారంతోనే పిల్లల శారీరక ఎదుగుదల సాధ్యం

టాటా చారిటబుల్ ట్రస్ట్ న్యూట్రిషన్ అసోసియేటర్ సుప్రియ.
పోషక ఆహారంతోనే పిల్లల శారీరక ఎదుగుదల సాధ్యమవుతుందని తిరుపతి జిల్లా సత్యవేడు టాటా చారిటబుల్ ట్రస్ట్ న్యూట్రిషన్ పోగ్రామ్ అసోసియేటర్ సుప్రియ చెప్పారు.గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరిగిన అంగన్వాడీ కార్యకర్త సమావేశానికి ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతూ తమ చారిటబుల్ ట్రస్ట్ అంగన్వాడి కేంద్రాల్లో పోషక ఆహార విలువలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.ఇందులో భాగంగానే సత్యవేడు, వరదయ్యపాలెం,బుచ్చినాయుడుకండ్రిగ మండలాల్లోని 179 అంగన్వాడి కేంద్రాల్లో గత ఎనిమిది నెలలుగా న్యూట్రిషన్పై అవగాహన కార్యక్రమం కొనసాగుతున్నట్టు ఆమె పేర్కొన్నారు.
