*తేది: 12/11/2025*

*మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా*
*కోటి సంతకాల సేకరణలో*
*చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామం*
*కోటి సంతకాల సేకరణకు హాజరైన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ & గూడూరు నియోజకవర్గ ఇంచార్జి మెరిగ మురళీధర్ గారు*
ఈ సందర్బంగా *మేరిగ మురళీధర్ గారు మాట్లాడుతూ..*
• *వల్లిపేడు లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు ఉత్సాహంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.*• *మీ ఇంటి బిడ్డ లాగా ప్రజలందరికీ సేవలు అందిస్తానని తెలిపారు.*
• *వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేసి.. ఈ రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యమన్నారు.*
• *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతి నాయకుడు, కార్యకర్తకి, గౌరవం, విలువ దక్కేల జగన్ మోహన్ రెడ్డి గారు భరోసా ఇస్తున్నారని అన్నారు.*
• *ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను..చంద్రబాబు నాయుడు ప్రైవేటుపరం చేస్తూ..అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటున్నాడని అన్నారు*.
• *పేద వారి కోసం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం కాకూడదనే లక్ష్యంతోనే.. జగన్మోహన్ రెడ్డి గారు.. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు.*
• *ఇది అహంకారానికి.. పేదవాడి ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్దామన్నారు.*
• *జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి.. ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.*
• *కోటి సంతకాల సేకరణకు.. ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూస్తుంటే.. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోక తప్పదున్నారు.*
*ఈ కార్యక్రమంలో చిల్లకూరు మండలం అధ్యక్షులు యద్దల మధుసూదన్ రెడ్డి గారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓడూరు బాలకృష్ణ రెడ్డి గారు, చెడిమాల సీనియర్ నాయకులు పిచ్చయ్య నాయుడు గారు,ఎంపీటీసీ చెంగయ్య గారు, తోనుకుమాల సర్పంచ్ చక్రపాణి రెడ్డి గారు, సర్పంచ్ వెంకటరమణయ్య గారు,బల్లవోలు కిరణ్ కుమార్ రెడ్డి గారు, చిల్లకూరు మండల మైనారిటీ నాయకులు ఇస్మాయిల్ గారు, తదితర నాయకులు పాల్గొన్నారు*
