||తిరుపతి జిల్లా పోలీస్ శాఖ||
||పోలీస్ కార్యాలయంలో రేపటి ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్’ (PGRS) రద్దు||

– తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ యల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,
తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో అక్టోబర్ 27న నిర్వహించాల్సిన ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టం’ (పి.జి.ఆర్.ఎస్)ను వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ యల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఈ రోజు (అక్టోబర్ 26) ఒక ప్రకటనలో తెలిపారు.
“మొంథా” తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, ప్రజల సౌకర్యార్థం అక్టోబర్ 27, సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరగాల్సిన ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టం’ను రద్దు చేస్తున్నాము. కావున, ఫిర్యాదుదారులు కార్యాలయానికి రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఎస్పీ గారు ప్రజలకు సూచించారు.
ప్రజలందరూ ప్రభుత్వం మరియు విపత్తు నిర్వహణ శాఖ సూచనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ యల్. సుబ్బరాయుడు ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు.
||జిల్లా పోలీస్ కార్యాలయం,||
||తిరుపతి.||
