*తమిళనాడులో మారిపోయిన లెక్కలు..ఎన్నికల్లో ఆ పార్టీదే విజయం..తేల్చేసిన సర్వే*

తమిళనాడు రాష్ట్రంలో నటుడు విజయ్ తన సొంత పార్టీ తమిళగ వెట్రి కళగం స్థాపన తర్వాత, 2026 అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీవీకే ప్రభావం ఎలా ఉండబోతుందో ఊహించే ఒక ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) సర్వే నిర్వహించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం..విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీ ఏకంగా 125 నుంచి 155 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఈ సంఖ్య అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (సాధారణంగా 118) కంటే చాలా ఎక్కువ.
అధికార పార్టీ DMK కేవలం 25 నుంచి 45 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) సర్వేలో తేలినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం ADMK 13 నుంచి 30 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా వేసింది.మిగిలిన పార్టీలు 2 నుంచి 5 స్థానాలను మాత్రమే దక్కించుకోగలవని ఈ సర్వే సూచించింది.
అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే నిజంగా సర్వే నిర్వహించిందా లేదా అన్నది తేలియాల్సి ఉంది.ఒకవేళ సర్వే నిర్వహించిన అది విజయ్ సభ వల్ల 40మందికి పైగా మరణించిన తర్వాత చేశారా లేదా తర్వాత చేశారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఈ సర్వే నిజమైతే.. TVK పార్టీ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించి, తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని చేపడుతుందని అర్థం అవుతోంది. తమిళ రాజకీయాల్లో నటుల ప్రభావం మరోసారి ఎంత బలంగా ఉండబోతుందో ఈ అంచనా చాటుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే మరియు బలమైన ప్రతిపక్షం ఏడీఎంకేలు అత్యల్ప స్థానాలకు పరిమితం కావడం పక్కా అని సర్వే
లో తేలింది.
