ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల సొమ్ము పెంచి ఇచ్చాం.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు
చిత్తూరు అక్టోబర్ 1 (గరుడ దాత్రి న్యూస్ )రాష్ట్రంలోని కూటమిప్రభుత్వం,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛను సొమ్ములను పెంచి ఇచ్చామని, మూడు నెలల బకాయిలతో కలిపి చెల్లించామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు చెప్పారు. బుధవారం నగరపాలక పరిధిలోని 24వ వార్డు శంకరయ్య గుంట, 25వ వార్డు బాలాజీ నగర్ లో పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛను సొమ్ములను అందించారు. పింఛన్ సొమ్మును ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసంపనిచేస్తుందని.. ఇచ్చినప్రతిహామీనినెరవేరుస్తూ ప్రజలకు మంచి పాలన అందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనపై లబ్ధిదారులతో మాట్లాడారు. ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, కమిషనర్ పి నరసింహ ప్రసాద్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, సహాయ కమిషనర్ ఎ ప్రసాద్, కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
