*ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు..ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి*

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిలిచే విజయదశమి పర్వదినం ప్రజలందరికీ శుభాలు కలిగించాలని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ఆకర్షించారు.కావలి నియోజకవర్గం ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసారు.విజయదశమి పండుగ అంటేనే అసత్యం మీద సత్యం,ఆదర్మం మీద ధర్మం, అజ్ఞానం మీద జ్ఞానం, చెడుపై మంచి సాధించే విజయానికి సంకేతమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అమ్మ దయ మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాలలో ధైర్యం, ధర్మం, నిజాయితీ, మానవత్వం ఎల్లప్పుడూ వెల్లివిరియాలని ఆయన అన్నారు. ప్రతి ఇల్లు ఆనందం, సౌభాగ్యం, ఆరోగ్యం,ఐశ్వర్యంతో తులతూగాలని కోరారు.
