Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీ‌వారి చ‌క్ర‌స్నానం

శ్రీ‌వారి చ‌క్ర‌స్నానం

– శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివ‌రి రోజైన‌ అక్టోబర్ 2వ తేదీ గురువారం శ్రీవారి పుష్కరిణిలో చ‌క్ర‌స్నానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశాం.

 

– ఉద‌యం 6 నుండి 9 గంట‌ల మ‌ధ్య శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు, చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.

 

– టిటిడి అధికారులు, విజిలెన్స్‌, పోలీసులు స‌మ‌న్వ‌యంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేప‌ట్టాం.

 

– భ‌క్తులు పుష్క‌రిణిలోకి ప్ర‌వేశించేందుకు, తిరిగి వెలుప‌లికి వెళ్లేందుకు వీలుగా గేట్ల‌ను ఏర్పాటు చేశాం.

 

– పుష్కరిణిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోట్ల‌ను అందుబాటులో ఉంచాం.

 

– చక్రస్నానం సందర్భంగా 1,000 మంది పోలీసులు, 1300 మంది టిటిడి విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఫైర్, స్మిమ్మింగ్ తదితర విభాగాల నుండి 140 మందితో పటిష్టమైన‌ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టాం.

 

– టిటిడి సూచించిన నిబంధనల మేరకు గ్యాలరీలలోని భక్తులను దశలవారీగా పుష్కరిణిలోకి అనుమ‌తిస్తాం.

 

– పుష్కరిణిలోనికి నిర్దేశించిన గేట్ల ద్వారా మాత్ర‌మే ప్ర‌వేశించాల‌ని, భక్తులు సంయమనం పాటించి టిటిడికి సహకరించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం.

 

– భక్తులు శ్రీవారి చక్రస్నానం వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడవీధుల్లో 23, పుష్కరిణిలో 4, మొత్తం 27 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశాం.

 

– భ‌క్తుల సౌల‌భ్యం కొర‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారం అందించేందుకు పుష్క‌రిణి స‌మీపంలోని ర‌థం వ‌ద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం.

 

– చ‌క్ర‌స్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశాం.

 

– చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయి. క‌నుక‌ భక్తులు ఈ రోజంతా ఎప్పుడైనా పుష్కరిణిలో స్నానం చేయవచ్చని ఈ సంద‌ర్బంగా భ‌క్తులంద‌రికి విజ్ఞప్తి చేస్తున్నాను.

————————————

Related posts

మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి

Garuda Telugu News

ఏపీలో ఇక ప్రభుత్వ కార్యాలయాలకు సౌర వెలుగులు!

Garuda Telugu News

తల్లిదండ్రులు – ఉపాధ్యాయులు సమావేశం (మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్(PTM)3.0)ను జయప్రదం చేయండి

Garuda Telugu News

Leave a Comment