*రేపు గాంధి జయంతి.. మద్యం, మాంసం నిషేధం..*

✍️ *అతిక్రమిస్తే చట్టరీత్య చర్యలు తప్పవు*
✍️ *పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేష్ హెచ్చరిక*
రేపు అనగా అక్టోబర్ 2న గురువారం గాంధి జయంతి సందర్భంగా మద్యం, మాంసం అమ్మకాలు పై నిషేధం విధిస్తున్నట్లు పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.
బుధవారం సాయంత్రం ఎస్ఐ వెంకటేష్ విలేకరులతో మాట్లాడుతూ ఎవరైనా నిబంధనలను అతిక్రమించి మద్యం, మాంసం దుఖానాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.
ప్రధానంగా మండలంలోని మద్యం, మాంసం, చేపల దుఖానాలు, హోటళ్ళు నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.
ప్రజలు సైతం రేపు అనగా గురువారం గాంధి జయంతి ని పురస్కరించుకొని మద్యం, మాంసం లకు దూరంగా ఉంటూ మహాత్ముడు చూపిన అహింసా మార్గాన్ని అనుసరిస్తూ, గాంధీజీ అడుగుజాడల్లో నడుద్దామని ఎస్ఐ వెంకటేష్ పిలుపునిచ్చారు.
