తిరుపతి జిల్లా వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీగా కండ్రిగ కవితవేణు

వైసీపీ నాయకత్వం విశ్వాసం దక్కించుకున్న వరదయ్యపాలెం మండలం తొండూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైసీపీ సీనియర్ నాయకురాలు “కండ్రిగ కవితవేణు” జిల్లా మహిళా విభాగం జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. పార్టీ శ్రేణుల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, మహిళా కార్యకర్తలను ఐక్యంగా నడిపించడంలో కవితవేణు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఆమెకు ఈ పదవి అప్పగించగా, జిల్లా వ్యాప్తంగా మహిళా కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. మహిళల సమస్యల పరిష్కారం, సమాజంలో వారిని మరింత ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని కవితవేణు స్పష్టం చేశారు. ప్రజల మధ్యకే వెళ్లి సమస్యలు విని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సంకల్పం వ్యక్తం చేశారు. నియామకంపై పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలుపుతూ, కవితవేణు నాయకత్వంలో మహిళా విభాగం మరింత బలోపేతం అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
