చెవిరెడ్డి గోవింద మాల దారణకు ఏసీబీ కోర్టు అనుమతి.
23 ఏళ్లుగా మాల దారణ చేసుకుంటున్న చెవిరెడ్డి.
18 ఏళ్లుగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరునికి బ్రహ్మోత్సవాలు నిర్వహణ.

తన భక్తివిశ్వాసాలను గౌరవించిన న్యాయమూర్తికి చెవిరెడ్డి కృతజ్ఞతలు.
తిరుపతి/గరుడ ధాత్రి/సెప్టెంబర్ 26
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిపై అపారమైన భక్తి.. శ్రీవారి మహిమలపై అచెంచలమైన విశ్వాసం.. సాక్షాత్తు ఆ దేవదేవున్ని తన గ్రామంలో నెలకొల్పిన పరమభక్తుడు ఆయన… ప్రతి ఏటా పెరటాసి మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు గోవింద మాల దారణ చేయడం ఆయన అలవాటు.. ఆయనే మనందరి నాయకుడు చెవిరెడ్డి. శ్రీవారిని మదినిండుగా కొలిచే పరమ భక్తుడు. గడచిన 23 ఏళ్లుగా గోవింద మాల దారణ చేసిన చెవిరెడ్డి తను ఆలయ నిర్మాణం చేయించిన తరువాత 18 ఏళ్లుగా ప్రతి ఏటా తిరుమల తరహాలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ ఆ వైకుంఠనాథునిపై తనకున్న భక్తిని చాటుకుంటున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏ స్థాయిలో అవాంతరాలు ఎదురైనా ఆయన గోవింద మాల మాత్రం మానలేదు.. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అక్రమంగా ఆయనను కేసులో ఇరికించి జైలులో నిర్భంధించడంతో మాల దారణకు నాలుగు రోజులు దూరం కావాల్సి వచ్చింది. ఈనెల 24వ తేదీన ఆయన ధర్మకర్తగా శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహణకు కంకణదారుడు కావాల్సి ఉంది. అంతకంటే ఒక్కరోజు ముందు ఆయన గోవింద మాల దారణ చేస్తారు. అయితే కోర్టు అనుమతి ఈనెల23వ తేదీకి వస్తుందని భావించినా కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. దీంతో 26వతేదీన జైలు నుంచి కోర్టుకు హాజరు పరచిన సమయంలో న్యాయమూర్తి ముందు తన గోవిందునిపై తనకున్న భక్తికి ఆటంకం కలిగించకండని చెవిరెడ్డి విన్నవించారు. చెవిరెడ్డికి శ్రీవారిపై వున్న భక్తిని గుర్తించిన విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గోవింద మాల దారణకు అనుమతించారు. తన భక్తిని గుర్తించి మాల దారణకు అవకాశం కల్పించిన న్యాయమూర్తికి చెవిరెడ్డి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కోర్టు అనుమతించడంతో రేపు ఉదయం చెవిరెడ్డి గోవింద మాల దారణ చేయనున్నారు.
