పూతలపట్టు సెప్టెంబరు 26( గరుడ దాత్రి న్యూస్) పూతలపట్టు మండలంలోని గ్రామాలు అన్ని అభివృద్ధి చెందాలంటే ప్రతి కార్యదర్శి సర్పంచులు పంచాయితీ పన్నులు సకాలంలో వసూలు చేపడితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పూతలపట్టు మండల అభివృద్ధి అధికారి నాగరాజు తెలిపారు.
పీ.జీ ఎస్.ఏ కార్యచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండల అభివృద్ధి కార్యాలయ సమావేశ మందిర 2025- 2026 కు సంబంధించి మండల గ్రామ కార్యదర్శిలకు సచివాల సిబ్బంది గ్రామ సర్పంచులు అవగాహన కార్యక్రమం నిర్వహించారుఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో ఉన్న పరిధిలోపెద్దహోటల్స్ .కళ్యాణ మండపాలు ఫ్యాక్టరీలు ఉన్నాయనివాటికిసంబంధించిన పన్నులు తప్పనిసరిగా వారి వద్ద నుంచి పన్నులు వసూలు చేయాలని కోరారు వారు ఇవ్వని పక్షంలో నోటీసులుజారీచేస్తేఆవిషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. వడ్డేపల్లి పంచాయతీ పేట మెట్ట . తేనేపల్లి. పంచాయతీలలో అధిక సంఖ్యలో ఫ్యాక్టరీలో ఉండటంవల్ల లక్షల రూపాయలు పన్నులు వసూలు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు తప్పనిసరిగా కార్యదర్శులు వారి వద్దకు వెళ్లి పన్నులు వసూలు చేయవలసిన బాధ్యత పంచాయతీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి శ్రీనివాసులు. సర్పంచులు. కార్యదర్శులు. డిజిటల్. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు. పంచాయతీ అధికారులు. సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
