శ్రీ మహాలక్ష్మి అవతారంలో పోలేరమ్మ దర్శనం.

మనుబోలు. 26.9.2025(.గరుడ దాత్రి )స్థానిక కోదండ రామాపురం దేవాంగుల వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం మహాలక్ష్మి అలంకరణ నిర్వహించడం జరిగినది.ఉదయం అమ్మవారికి పంచామృతాలతో పసుపు కుంకుమలతో విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా పి. సాయి హర్షిత వ్యవహరించారు అమ్మవారికి మహాలక్ష్మి సహస్రనామార్చన కుంకుమార్చనలు నిర్వహించబడ్డాయి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారి దర్శించుకున్నారు అర్చకులుగందళ్ల శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. దసరా సందర్భంగా పోలేరమ్మ గుడి విద్యుత్ దీపాలలంకరణచేసారు
