*శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రజలందరినీ చల్లగా చూడాలి*

✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆకాంక్ష*
✍️ *పిచ్చాటూరు లో శ్రీవారి గొడుగులు ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే*
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రజలు అందరినీ చల్లగా చూడాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు.
ప్రతియేటా చెన్నైలోని తిరునిండ్రయూర్ కు చెందిన శ్రీమద్ రామానుజ ఆచార్య నిత్య కైంకర్యం ట్రస్టు వారు శ్రీవారి గొడుగులను పాదయాత్రగా తీసుకెళ్ళి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గరుడ సేవ నాటికి తిరుమల వెంకన్న స్వామికి సమర్పించడం ఆనవాయితీ.
అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం శ్రీవారి గొడుగులు పిచ్చాటూరుకు చేరుకుంది.
అప్పటికే పిచ్చాటూరులో వేచి ఉన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శ్రీవారి గొడుగులుకు ఎదురేగి స్వాగతం పలికారు.
స్వామి వారి పీఠాన్ని తలపై మోస్తూ కాసేపు భక్తులతో కలిసి ఎమ్మెల్యే ఆదిమూలం నడిచారు.
అనంతరం శయనమూర్తిగా ఉన్న శ్రీ గోవింద రాజ స్వామిని, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవర్లను ఎమ్మెల్యే దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ డి ఇలంగోవన్ రెడ్డి, పారిశ్రామిక వేత్త పి.మునిశేఖర్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు పద్దు రాజు, మురళి, రవి తదితరులు పాల్గొన్నారు.
