ఓం శక్తి ఆలయం వద్ద గోవింద భక్తులకు భారీ అన్నదానం.

నగరి సెప్టెంబర్ 26 (గరుడ దాత్రి)
నగరి ఓంశక్తి ఆలయం వద్ద తమిళనాడు ఓచ్చేరి నుంచి విచ్చేసిన సుమారు 750 మంది గోవింద భక్తులకు పట్టణ పరిధిలోని పలువురు దాతలు శుక్రవారం అన్నదానం చేశారు. దీంతో ఓంశక్తి ఆలయ ఆవరణలతో పాటు రహదారి కూడా గోవింద భక్తులతో నిండింది. ఆలయంలో గోవింద భజనలు మిన్నంటాయి. భజన అనంతరం ఆలయంలోని గోవింద భక్తులతో పాటు, పాదచారులకు కూడా అన్నదానం చేయడం ప్రత్యేకంగా నిలిచింది. 18 యేళ్ల పాటుగా భారీ ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దాతలు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్న ఆలయ నిర్వాహకులకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు ఆరుముగం, పెరుమాళ్, సుబ్రమణ్యం, జయచంద్రారెడ్డి, గోపాల్‌రెడ్డి, రమేష్,కుమార్, దయానిధి, చంద్రారెడ్డి, మునికృష్ణారెడ్డి, ఎల్లప్పరెడ్డి, వేలు, రామ్‌మోహన్, కృపానిది, అశోక్, రామూర్తి, పొన్నురంగం, దేవా, మురళీమోహన్, కాశి, జగన్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
