Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం

 

తిరుమల, 2025 సెప్టెంబర్ 26

 

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం

తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ జానపద నృత్యాలు, కళారూపాలకు అద్భుత వేదికగా నిలిచాయి.

 

శుక్రవారం ఉదయం సింహ వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన వైవిధ్యమైన కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

 

మొత్తం 9 రాష్ట్రాలకు చెందిన 20 బృందాలు, 557 మంది కళాకారులు పాల్గొని వాహనసేవ వైభవాన్ని మరింతగా పెంచారు.

 

గుస్సడీ నృత్యం (తెలంగాణ), తిప్పని (గుజరాత్), లవణి (మహారాష్ట్ర), భరతనాట్యం, నవదుర్గ, కూచిపూడి (ఆంధ్రప్రదేశ్), బిహు నృత్యం (అస్సాం), సంపల్పురి నృత్యం (ఒడిశా), గౌరాసుర్ (ఝార్ఖండ్), శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (కర్ణాటక), ఢాక్ నృత్యం (పశ్చిమ బెంగాల్) మొదలైన కళా ప్రదర్శనలు భక్తులకు అపూర్వమైన అనుభూతిని కలిగించాయి.

—————–

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Related posts

ఈ నెల16న శ్రీశైలానికి మోదీ రాక…

Garuda Telugu News

లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవిపై సోమిరెడ్డి ట్వీట్

Garuda Telugu News

సీనియర్ నటుడు విజయ రంగరాజు గుండెపోటుతో సోమవారం మృతి చెందారు

Garuda Telugu News

Leave a Comment