*వేడుకగా ఆరిమాకుల పల్లె* *ఆరిమాను గంగమ్మ అమ్మవారి*
*శరన్నవరాత్రి ఉత్సవాలు*…

*అమ్మవారి సేవలో తరించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు*
—————————-
ఎస్ ఆర్ పురం మండలం
26-09-25
—————————-
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, తయ్యూరుపాయికట్ఠు ,ఆరి మాకులపల్లెలో వెలసిన ఆరిమాను గంగమ్మ ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు గంగమ్మ అమ్మవారి సేవలో తరించారు. అమ్మను దర్శించి మొక్కలు చెల్లించుకున్నారు.
అంతకు ముందు ఆరిమాకులపల్లెకు చేరుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ…,ఆరిమాను గంగమ్మ ఆలయ ముఖద్వారం వద్ద ఆలయ ధర్మకర్తలు, ఆలయ ఈ.వో., అధికారులు, అర్చకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు , ప్రజలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
మంగళ వాయిద్యాల నడుమ చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సి.ఆర్.రాజన్ తో కలిసి ఆరిమాను గంగమ్మ ఆలయానికి చేరుకుని, అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు ఎం.పి.దగ్గుమళ్ళ ప్రసాదరావుకు వేదాశీర్వచనం అందించగా.., ఆలయ ధర్మకర్తలు, ఈ.వో తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ.. సకాలంలో విస్తారంగా వర్షాలు కురిసి..,పల్లె ప్రాంతాలు పాడిపంటలతో తులతూగాలనీ, పల్లె ప్రజలు అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలనీ అమ్మ వారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిద్దయ్య శెట్టి. హిమాచలపతి రెడ్డి , జలంధర్ నాయుడు, హేమాద్రి యాదవ్ వెంకటరమణ ముని రెడ్డి నాయకులు గంధం నేని రాజశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు..
