
*సూపర్ జి.ఎస్.టి.2.0 తగ్గింపు ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి.*
*కమిషనర్ ఎన్.మౌర్య*
కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సూపర్ జి.ఎస్.టి 2.0 వలన కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జి.ఎస్.టి. 2.0తో ప్రజలకు కలిగే ప్రయోజనాలపై నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలపై శుక్రవారం నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జి.ఎస్.టి.ని గణనీయంగా తగ్గించిందని తెలిపారు. ముఖ్యంగా 12 నుండి 5 శాతం వరకు తగ్గించడం జరిగిందని, కొన్నింటి పైన 28 నుండి 18 శాతం వరకు జి.ఎస్.టి. తగ్గించడం జరిగిందని తెలిపారు. తద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ది చేకూరుతున్నాదనే విషయాలను తెలియజేయాలని తెలిపారు. ఏ ఏ వస్తువుల పైన ఏ మేరకు తగ్గాయనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. నేటి నుండి అక్టోబర్ 19 వ తేదీ వరకు నాలుగు వారాల పాటు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జి.ఎస్.టీ.2.0. తగ్గింపు పై ప్రతి గడపకు చేరేలా అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సూపర్ జి.ఎస్.టి.2.0 వల్ల కలిగే ప్రయోజనాలపై వివిధ రకాల అంశాలతో ప్రజలకు చేరే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, డీసీపీ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
