*_శ్రీశైలంలో ఐదవ రోజు స్కంద మాత దుర్గా అలంకరణ_*

*పంచమి – స్కందమాత*
సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయా
శుభదాస్తు సదా దేవీ స్క౦దమాతా యశస్వినీ!!
ఈ చరాచర జగత్తుకే మూలపుటమ్మ . శక్తిధరుడైన స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది. సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు.
