*బాధితులకు అండగా ఉండడమే ధ్యేయంగా పనిచేస్తా..*
✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం*
✍️ *9 మందికి రూ.5.11 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ*

బాధితులకు అన్నీ విధాలుగా అండగా ఉండడమే లక్ష్యంగా పని చేస్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు.
గురువారం నారాయణవనంలో వివిధ మండలాలకు చెందిన తొమ్మిది మంది బాధితులకు రూ.5.11 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఇందులో పిచ్చాటూరు మండలం వెంగలత్తూరూకు చెందిన ఎన్.హరీష్ బాబుకు రూ.32,897లు, గోవర్ధనగిరి కి చెందిన ఎ.వరలక్ష్మికి రూ.52,284లు.
వరదయ్య పాలెం కు చెందిన రెడ్డి మాధవికి రూ.83,000లు, డి.నాగభూషణమ్మ కు రూ.1,52,187లు,
నాగలాపురం మండలంలోని వేభాక్కం కు చెందిన బి.మురళికి రూ.31,395లు, నాగలాపురం కు చెందిన జి.మనోహరన్ కు రూ.27,348లు,
నారాయణవనం కు చెందిన ఎన్.జానిమకు రూ.11,441లు, భీముని చెరువుకు చెందిన డి.గణపతికి రూ.37,205లు, తుంబూరు కు చెందిన ఎన్.రాజన్ కు రూ.83,362లు
మొత్తం 9 మంది బాధితులకు రూ.5,11,119లు చెక్కుల రూపంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాదితులు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రభుత్వ సాయం కోసం తనను ఆశ్రయించారన్నారు.
వెంటనే స్పందించి బాదితుల ఆసుపత్రి ఖర్చులకు సంబందించిన బిల్లులతో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయాలని దరఖాస్తు చేశామన్నారు.
తక్షణం స్పందించి ముఖ్యమంత్రి కార్యాలయం తన సిఫార్సును పరిశీలించి తొమ్మిది మంది బాధితులకు రూ.5.12 లక్షలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వివరించారు.
తాను కోరిన వెంటనే బాధితులను ఆదుకున్న ముఖ్యమంత్రి కార్యాలయానికి, సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డి.ఇలంగోవన్ రెడ్డి, టిడిపి నేతలు మురళి, రమేష్, బాధితులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
