
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబునాయుడు గారితో కలిసి కుటుంబసమేతంగా పాల్గొన్నాను. ముందుగా తిరుమలలోని బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబునాయుడు గారు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కుటుంబసమేతంగా కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నాం. వేదమంత్రోచ్ఛారణల మధ్య వేదపండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ కేలండర్, డైరీలను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నాం.
