*అమరావతి*

*💥ఏపీ అసంబ్లీ లో అక్రమ రేషన్ బియ్యం పై మంత్రి నాదెండ్ల వివరణ💥*
*👉కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 234 కోట్ల విలువైన రేషన్ బియ్యం పట్టుకున్న అధికారులు*
*👉నెల్లూరు లో అక్రమ రేషన్ బియ్యం అరికట్టేందుకు చెక్ పోస్ట్ ఏర్పాటు*
పౌరసరఫరాల వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించడంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.234 కోట్ల విలువైన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాకినాడ పోర్టులో 3, విశాఖలో 3, నెల్లూరులో ఒక చెకోపోస్టు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. 5.65 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏడాదిలోనే స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రూ.5.45 కోట్ల విలువైన బియ్యాన్ని పక్కదారి పట్టించారన్నారు. రెండు రోజుల్లో ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు..
