*రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*

*సత్యవేడు నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి* – *విద్యా రంగ అంశాలపై లోకేష్‌తో ప్రత్యేక చర్చ*
ముఖ్యంగా:-దాసుకుప్పం బైపాస్ రోడ్డు, టిడిపి కోట రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని గుర్తు చేశారు
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మాత్సవాలు పురస్కరించుకొని శ్రీ వారికి పట్టు వస్త్రాలు సమర్పణ కోసం కుటుంబ సమేతంగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం రేనుగుంట విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి సాదర స్వాగతం పలికారు
ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ముఖ్యమంత్రికి వివరించి, తక్షణ పరిష్కారం కోసం విజ్ఞప్తి చేశారు. ప్రజల అభ్యున్నతి కోసం అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కోరారు.ఎమ్మెల్యే ఆదిమూలం తన నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రికి అభ్యర్థనలు సమర్పించారు. మౌలిక వసతులు, రహదారులు, తాగునీటి సమస్యలు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు*.*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమస్యలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేసి, తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినట్లు సమాచారం అదేవిధంగా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కూడా ఎమ్మెల్యే ఆదిమూలం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో విద్యా రంగ సమస్యలు చర్చకు వచ్చాయి
