Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప ద‌ర్శ‌నం

చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప ద‌ర్శ‌నం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

చిన్న‌శేష వాహనం – కుటుంబ శ్రేయస్సు

చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు, సివిఎస్వో శ్రీ ముర‌ళికృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

Related posts

విద్యుదాఘాతంతో పాడి పశువులు మృతి

Garuda Telugu News

తిరుపతి-పాకాల-కాట్పాడి రైలు మార్గ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

Garuda Telugu News

అలిపిరి టోల్‌గేట్ వద్ద ఆకస్మిక తనిఖీ

Garuda Telugu News

Leave a Comment