Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యునిగా చిత్తూరు ఎంపి శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు నియామకం….

*తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యునిగా చిత్తూరు ఎంపి శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు నియామకం*..

*ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపిన చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు*..
—————————-

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్పూర్తి.., రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అందించిన ప్రోత్సాహంతో టీడీపీలో చేరి.., చిత్తూరు పార్లమెంటు ప్రజల ఆశీస్సులతో చిత్తూరు పార్లమెంటు సభ్యునిగా అత్యధిక ఓట్ల మెజారితో గెలుపొందాను. ఢిల్లీ లోక్ సభలో చిత్తూరు ఎంపీగా ప్రమాణస్వీకారం చేసి.., ప్రజాసేవకు అంకితమయ్యాను.

ఏపీ సీఎం శ్రీ చంద్ర బాబు నాయుడు గారి ఆదేశాలను తుచా తప్పకుండా పాటిస్తూ..,
చిత్తూరు పార్లమెంటు సభ్యునిగా.., టిడిపి పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా.., జాతీయ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యునిగా.., జాతీయ ఫార్మా ఎరువులు మరియు రసాయనాల స్టాండింగ్ కమిటీ సభ్యులు, జాతీయ సోషల్ జస్టిస్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలో కన్సల్టేటివ్ కమిటీ సభ్యులుగా.., కొత్తగా ప్రవేశపెట్టిన ఆదాయ పన్ను బిల్లు ఎంపిక కమిటీలో సభ్యునిగా.., కేంద్ర రైల్వే కన్సల్టేటివ్ కమిటీలలో నా కర్తవ్యాన్ని శ్రద్ధా శక్తులతో నిర్వర్తిస్తున్నాను.. అలాగే
నా చిత్తూరు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీటీడీ,జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలను సమన్వయ పరుచుకుంటూ…. చిత్తూరు పార్లమెంటు అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను. అదే సమయంలో తెలుగు దేశం పార్టీ ఆదేశాలను పాటిస్తూ.., పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో చేస్తున్న కృషిని…,
నేను చేస్తున్న సేవలను గుర్తించి.., నన్ను *తెలుగు దేశం పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యునిగా* ఎంపిక చేసిన గౌరవ నీయులు ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి.., రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు.., ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..

మీ…

*శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు*…

*చిత్తూరు పార్లమెంటు సభ్యులు*

Related posts

తిరుపతి జిల్లాలో నగరి నియోజకవర్గం విలీన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా…

Garuda Telugu News

మా ఎమ్మెల్యేను విమర్శిస్తే పుట్టగతులు ఉండవు

Garuda Telugu News

ఏపీలో కొత్తగా నాలుగు లేన్ల హైవే.. ఆ రూట్లోనే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

Garuda Telugu News

Leave a Comment