
*రాబోయే మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు*
అమరావతి వాతావరణ కేంద్రం వర్షాలపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
