
*పిచ్చాటూరు – పెనాలూరు పేట బస్సు పునఃప్రారంబానికి కసరత్తు*
✍️ *ఈ నెల 20న సత్యవేడు నుండి మరో రెండు బస్సు సర్వీసులు ప్రారంభం*
✍️ *త్వరలో సత్యవేడు నుండి విజయవాడ కు బస్సు సర్వీసు*
✍️ *పిచ్చాటూరు, నాగలాపురం బస్టాండులలో సిమెంటు కాంక్రీట్*
✍️ *ఎమ్మెల్యే ఆదిమూలం కోరిక మేరకు ఆర్.ఎం నరసింహులు ప్రకటన*
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గతవారం ఇచ్చిన విజ్ఞప్తి మేరకు పిచ్చాటూరు – పెనాలూరు పేట బస్సు పునఃప్రారంబానికి ఆర్టీసీ తిరుపతి రీజినల్ మేనేజర్ నరసింహులు, సత్యవేడు డిపో మేనేజర్ వెంకటరమణ తో కలిసి మంగళవారం సర్వే చేశారు.
ఈ క్రమంలో పిచ్చాటూరు లో అధికారుల సమీక్ష లు ఉన్న ఎమ్మెల్యే ఆదిమూలంను రీజినల్ మేనేజర్ నరసింహులు, సత్యవేడు డిపో మేనేజర్ వెంకటరమణలు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, స్థానిక నాయకులతో కలిసి గజ మాలతో రీజనల్ మేనేజర్ ను, డిపో మేనేజర్ ను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ గతంలో ఇచ్చిన వినతులతో పాటు సత్యవేడు నుండి విజయవాడకు, రాత్రి 8 గంటలకు సత్యవేడు నుండి తిరుమలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రీజినల్ మేనేజర్ ను కోరారు.
అలాగే పిచ్చాటూరు, నాగలాపురం లలో ఉన్న ఆర్టీసీ బస్టాండులను సర్వే చేసి బస్టాండు ఆవరణలో సిమెంటు కాంక్రీట్ వేయాలని ఎమ్మెల్యే విన్నవించారు.
ఇందుకు సానుకూలంగా స్పందించిన రీజినల్ మేనేజర్ నరసింహులు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారి కోరిక మేరకు సత్యవేడు నుండి విజయవాడ కు నూతన బస్సు సర్వీసు ను త్వరలో ప్రారంభిస్తామని, ఇందుకోసం కొత్త బస్సును రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామని, ప్రక్రియ పూర్తి అయిన వెంటనే విజయవాడ సర్వీసును ప్రారంభిస్తామని ప్రకటించారు.
అలాగే పిచ్చాటూరు, నాగలాపురం ఆర్టీసీ బస్టాండులను సర్వే చేయడంతో పాటు సిమెంటు కాంక్రీట్ వేయడానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ఈ నెల 20న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాత్రి 8 గంటలకు సత్యవేడు నుండి తిరుమల కు బస్సు సర్వీసును ప్రారంభిస్తామని, అలాగే సత్యవేడు నుండి వయా సంత వేలూరు మీదుగా సూళ్ళూరు పేట కు బస్సును ప్రారంభిస్తామని, ఇదే బస్సును లాస్ట్ ట్రిప్పు సత్యవేడు నుండి శ్రీ కాళహస్తి కి నడపనున్నట్లు ఆర్.ఎం నరసింహులు వివరించారు.
అనంతరం పిచ్చాటూరు – పెనాలూరు పేట బస్సు సర్వీసు నడపడానికి తమిళనాడు పర్మిట్ తీసుకునే ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని తెలిపిన ఆర్.ఎం అనంతరం పెనాలూరు పేట రూట్ పరిశీలనకు అధికారుల బృందం బయలుదేరి వెళ్లింది.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డీ ఇలంగోవన్ రెడ్డి, తెలుగుదేశం సీనియర్ నాయకులు జయచంద్ర నాయుడు, వాసు రెడ్డి, భక్తా రెడ్డి, బి.ఎం.దొరై వేలు, రవి, మల్లిఖార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
