
*జై భీమ్ నినాదాలతో హోరెత్తిన నారాయణవనం*
✍️ *ఘనంగా బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి*
✍️ *పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే ఆదిమూలం దుస్తులు వితరణ*
✍️ *500 మంది పేదలకు అన్నదానం*
బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని సోమవారం నారాయణవరం పట్టణం జై భీమ్.. నినాదాలతో హోరెత్తింది.
ఉదయం 8.30 గంటలకు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు మరియు జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బైపాస్ కూడలి వద్ద ఉన్న భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి ఎమ్మెల్యే ఘనంగా నివాళి అర్పించారు.
అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పుట్టినరోజు కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు.
అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు.
అనంతరం 500 మంది పేదలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ చేతుల మీదుగా అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా ‘జై భీమ్’.. నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.
యుగ పురుషుడు, భారతరత్నబి.ఆర్. అంబేద్కర్ అని ఎమ్మెల్యే కొనియాడారు.
అఖండ భారతావనికి రాజ్యాగాన్ని నిర్మించి దేశం సురక్షితంగా.. న్యాయబద్ధంగా ముందుకు నడవడానికి బాటలు వేసిన గొప్ప మహనీయులు బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే కీర్తించారు.
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు’ కార్యకర్తలు కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
