Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజధాని కోసం మరో 44 వేల ఎకరాలు

*ఏపీ రాజధాని కోసం మరో 44 వేల ఎకరాలు*

*ఈ గ్రామాల్లో భూ సమీకరణం కోసం కసరత్తు*

 

తూళ్లూరు మండలంలోని హరిచంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లోని 9వేల 919 ఎకరాలు.. అమరావతి మండలంలోని వైకుంఠపురం, ఎండ్రాయి, కార్లపూడి, మొత్తడాక, నిడముక్కల గ్రామాల్లోని 12వేల 838 ఎకరాల్లో భూసమీకరణ చేయనుంది.

 

తాడికొండలోని తాడికొండ, కంతేరు గ్రామాల్లోని 16వేల 463 ఎకరాలను భూసమీకరణ ద్వారా సేకరించనుంది సీఆర్డీయే. మంగళగిరిలోని కాజా గ్రామంలోని 4వేల 492 ఎకరాలను భూసమీకరణ ద్వారా సేకరించనుంది. రెండు మూడు రోజుల్లో ఆయా గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది సీఆర్డీయే. ఇప్పటికే రాజధానిలోని 29 గ్రామాల్లోని 34వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంది సీఆర్డీయే.

 

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఇన్నర్ రింగ్ రోడ్డుకు మధ్యలోని భూములను సేకరించనుంది సీఆర్డీయే. అమరావతికి ఎయిర్ పోర్ట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎర్రుపాలెం నుండి అమరావతి వరకు కొత్తగా వేయనున్న రైల్వే లైన్ కోసం ఈ భూములను వినియోగించనుంది రాష్ట్ర ప్రభుత్వం.

Related posts

సినిమా పైరసీ.. వారిపై చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

Garuda Telugu News

మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు ఘనంగా బాలల దినోత్సవం 

Garuda Telugu News

పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించండి

Garuda Telugu News

Leave a Comment