Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న శ్రీమతి అన్నా కొణిదల గారు

• తిరుమల చేరుకొని టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పత్రాలపై సంతకం

• అనంతరం శ్రీ వరాహ స్వామివారి దర్శనం… పద్మావతి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పణ

 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు సతీమణి శ్రీమతి అన్నా కొణిదల గారు గారు ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. కొద్ది రోజుల కిందట సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి శ్రీ పవన్ కల్యాణ్ గారి దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. తమ బిడ్డకు దైవ కృపతో పునర్జన్మ లభించినట్లయిందని, ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శ్రీమతి అన్నా కొణిదల గారు మొక్కుకున్నారు. శనివారం అర్థరాత్రి సింగపూర్ నుంచి శ్రీ పవన్ కల్యాణ్ గారు, శ్రీమతి అన్నా గారు తమ బిడ్డను తీసుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మొక్కులు చెల్లించుకొనేందుకు శ్రీమతి అన్నా కొణిదల గారు తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ నిబంధనలు అనుసరిస్తూ – గాయత్రి సదనంలో అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం శ్రీ వరాహ స్వామి వారి దర్శనానికి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వరాహ స్వామి వారి దర్శనం తరవాత పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకున్నారు. అక్కడ భక్తులందరితోపాటు తలనీలాలు సమర్పించారు.

*సుప్రభాత సమయంలో…*

సోమవారం వేకువజామున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తారు. సుప్రభాత సమయంలో స్వామి వారిని దర్శించుకుంటారు. టీటీడీ అధికారులకు నిత్యాన్నదానానికి విరాళం అందిస్తారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరిస్తారు.

Related posts

పిచ్చాటూరు లో భక్తి ప్రపత్తులతో శ్రీవారి గొడుగులు ఊరేగింపు

Garuda Telugu News

మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది

Garuda Telugu News

కోడి పందేలపై వింజమూరు ఎస్ ఐ వీర ప్రతాప్ కొరడా

Garuda Telugu News

Leave a Comment