
*ఆంధ్ర జ్యోతి విలేకరి రాహుల్ కు ఎమ్మెల్యే ఆదిమూలం పరామర్శ*
✍️ *త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్ష*
నాగలాపురం ఆంధ్రజ్యోతి విలేఖరి రాహుల్ రోడ్డు ప్రమాదంలో గాయాలై చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాగలాపురం మండలంలోని రాహుల్ స్వగ్రామమైన సురటపల్లి పంచాయితీ కస్తూరి నాయుడు కండ్రిగ గ్రామానికి ఎమ్మెల్యే చేరుకొని ఆంధ్రజ్యోతి విలేకరిని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కోసం పరితపించే విలేఖరి రాహుల్ ప్రమాదవశాత్తు గాయాలు పాలవడం బాధాకరమన్నారు.
రాహుల్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ విలేకరి వృత్తిలో రాణించాలని ఎమ్మెల్యే ఆదిమూలం ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.
