
ఏకాంబర కుప్పం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదనలు సిద్ధం చేసి పూర్తి చేయండి- రైల్వే మరియు ఆర్ అండ్ బి అధికారులకు *నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్* ఆదేశం
నియోజకవర్గం లో రైల్వే క్రాస్ లు ఉన్న నగరి మున్సిపాలిటీ ఏకాంబరకుప్పం రైల్వే లెవెల్ క్రాస్ (49) వద్ద ఓవర్ బ్రిడ్జి, పుత్తూరు రైల్వే లెవెల్ క్రాస్ (55) మరాఠి గేట్ వద్ద అండర్ బ్రిడ్జి, పుత్తూరు ఆర్ డి ఎం రైల్వే క్రాస్ (56) వద్ద ఓవర్ బ్రిడ్జి, వడమాలపేట మండలం పూడి క్రాస్ (67) వద్ద ఓవర్ బ్రిడ్జి ప్రతి పాదనలు సిద్ధం చేసి, పనులు మంజూరు అయి పూర్తి అయ్యేట్లు చూడాలని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు ఆర్ అండ్ బి మరియు రైల్వే, కన్సల్టెన్సీ లను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే గారి స్వగృహం లో అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేసారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సహకారం తో రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జి నిర్మించి ప్రజల కష్టాలు తీరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఓవర్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతం లో లైట్ వెహికల్ కోసం సబ్ వే లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఈ సమీక్ష లో
చిత్తూరు ఆర్ అండ్ బి ఈఈ -శ్రీనివాసులు, తిరుపతి ఆర్ అండ్ బి ఈఈ -మధుసూదన్
పుత్తూరు డి ఈ -అమరనాథ్
