
గర్జించిన పాత్రికేయులు..!
– తప్పుడు కేసులు ఎతివేయాలని డిమాండ్
– ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
– చిత్తూరు ఆర్డీవో కు వినతి పత్రం అందజేత
చిత్తూరు : పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, జర్నలిస్టులను అనగదొక్కాలని చూస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చిత్తూరులో పాత్రికే లోకం కదం తొక్కింది. APUWJ మరియు చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లోకనాథన్, మురళీకృష్ణ, చిత్తూరు ప్రెస్ క్లబ్ కార్యదర్శి కాలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వన్ టౌన, గాంధీ విగ్రహం, RDO కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు లోకనాథన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జర్నలిస్టులో గొంతుపై కత్తి పెట్టి కేసులు పెట్టి లోవర్చుకోవాలని చూస్తోందన్నారు. పల్నాడులో వైఎస్ఆర్సిపి కార్యకర్త హత్యకు గురైన వార్తలు రాసినందుకు 6 మంది పాత్రికేయులతోపాటు, సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి పై క్రిమినల్ కేసులు పెట్టడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. వాస్తవంగా ప్రచురితమైన వార్త నచ్చనప్పుడు దాన్ని ఖండించడము లేకుంటే న్యాయపరంగా ముందుకు వెళ్లడం చేయాలి తప్ప ఎవరో ఇచ్చిన ఫిర్యాదు పై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి భావవ్యక్తీకరణ ను హరించడమేనన్నారు. రాష్ట్ర డిజిపి సైతం కనీస న్యాయ సలహా తీసుకోకుండా పాత్రికేయులపై కేసు పెట్టడం మంచిది కాదన్నారు భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న పాత్రికేయ రంగం ఆగాతానికి తోసి వేయబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులను కలిసి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం నమోదు చేసిన కేసిన వెంటనే వసంహరించేలా తమ డిమాండ్లు ప్రభుత్వానికి నివేదించాలని కోరారు అందిస్తూ వినతి పత్రాన్ని కలెక్టర్కు నివేదించి ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జయప్రకాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష ,వెంకటేష్ , చిత్తూరు ప్రస్తుతం ఉపాధ్యక్షుడు పవన్ ,శివకుమార్ , కార్యవర్గ సభ్యులు చంద్ర ,రాజేష్, బాల గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుమలయ్య, తవణంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జగన్నాథం, కార్యదర్శి అనంత్ , కోశాధికారి జీవన్ ,పాత్రికేయులు హేమంత్ కుమార్, అప్పు, ప్రవీణ్ ,జయకుమార్ ఐరాల చిన్న, కిషోర్ పాల్గొన్నారు
