
హామీలు అమలు చేసే సత్తా, నైపుణ్యం చంద్రబాబుకే సొంతం.
* అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్.
* సంతృప్తిని వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ.
కుప్పం,ఏప్రిల్ 09(గఫుడా ధాత్రి న్యూస్): ఇచ్చిన హామీలను అమలు చేసే సత్తా నైపుణ్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కే సొంతమని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. బుధవారం కుప్పంలోని అన్న క్యాంటీన్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో ఆహారం స్వీకరించేందుకు వచ్చిన ప్రజలతో ఆయన మాట్లాడారు. క్యాంటీన్లో అందిస్తున్న ఆహారం రుచి, శుచిగా ఉందని ప్రజలు ఎమ్మెల్సీ కు తెలియజేశారు. దీనిపై ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. హామీల్లో భాగంగా పేదలకు పట్టెడు అన్నం పెట్టేందుకు కోసం అన్నా క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. ఇదేవిధంగా రాష్ట్ర సర్వోతో ముఖాభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. తలసరి ఆదాయం పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో రెండో స్థానంలో నిలవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే కుప్పంలోని రాజా పార్కును ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో కుప్పం అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు ఎస్. రాజకుమార్, మైనార్టీ నాయకులు జాకీర్, కౌన్సిలర్ సురేష్, రాష్ట్ర వన్నియరల్ కుల క్షత్రియ కార్పొరేషన్ డాక్టర్ వేణుగోపాల్, రాష్ట్ర టిడిపి నేత గోపీనాథ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
