
*సత్యవేడు నియోజకవర్గానికి విఘ్నాలన్ని తొలగిపోవాలి*
*ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆకాంక్ష*
*సత్యవేడు విఘ్నేశ్వరుని ఆలయ మహా కుంభాభిషేకంలో ఎమ్మెల్యే*
*ఆలయ నిర్మాణ దాతలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు* 🙏
సత్యవేడు నియోజకవర్గానికి విఘ్నాలన్నీ తొలగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆకాంక్షించారు.
గురువారం ఉదయం సత్యవేడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎదురుగా ఉన్న శ్రీ విఘ్నేశ్వరుని ఆలయ మహా కుంభాభిషేకం లో ఎమ్మెల్యే పాల్గొని స్వామి వారి సేవలో తరించారు.
ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా నిర్వహించిన మహా కుంభాభిషేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులైయ్యారు.
ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలుకగా, గ్రామ పెద్దలు ఎమ్మెల్యే కు ఆలయ మర్యాదలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా తన సత్యవేడు నియోజకవర్గంలో ప్రాచీన సుప్రసిద్ధ ఆలయాలు అయిన నాగలాపురం లోని శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి దేవాలయం, సురుటపల్లి లోని శ్రీ మంగళా దేవి సమేత పల్లి కొండేశ్వర స్వామి ఆలయం, పిచ్చాటూరు మండలం రామగిరి లో వెలసిన శ్రీ మరగదాంబిక సమేత శ్రీ వాళీశ్వర స్వామి దేవాలయం, నారాయణవనం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలు ఉండటం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
అలాగే ప్రకృతి అందాలను ఒలకబోసే కైలాసనాథ కోన జలపాతం, ఆరె జలపాతం, ఉబ్బల మడుగు జలపాతం, సద్దికూడు మడుగు జలపాతం, సింగిరి కోన జలపాతం కొలువుండడం సంతోషంగా ఉందన్నారు.
వీటన్నింటినీ అభివృద్ధి చేసే భాద్యతను తాను తీసుకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో ఇంత పెద్ద ఎత్తున శ్రీ విఘ్నేశ్వరుని ఆలయాన్ని నిర్మించడం తో పాటు వైభవంగా మహా కుంభాభీషేక క్రతువును నిర్వహించిన దాతలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
