
*చిత్తూరు జిల్లా పోలీసు*
*పత్రికా ప్రకటన*
*పూతలపట్టు మండలంలోని బండపల్లి గ్రామ శివారులలో పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 8 లక్షల రూపాయలు, 15 ద్విచక్రవాహనాలు మరియు 11 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పూతలపట్టు పోలీసులు.*
*చట్టాన్ని విస్మరించి జూదం మరియు ఇతర అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారిపై చిత్తూరు జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.*
*ఇందులో బాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS గారి ఆదేశాల మేరకు పూతలపట్టు మండలంలోని బండపల్లి గ్రామ శివారులోని మామిడి తోటలో ఈరోజు పూతలపట్టు పోలీసులు జరిపిన ఆకస్మిక దాడులలో పేకాట ఆడుతున్న 10 మంది పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 8 లక్షల రూపాయలు, 15 ద్విచక్రవాహనాలు మరియు 11 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేశారు.*
*అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై చిత్తూరు జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇటువంటి వాటి పై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేసారు.*
