
*మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరామర్శ*
*వరదయ్య పాలెం, కేవీబి పురం మండలాల్లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన*
బుధవారం నియోజక వర్గంలోని రెండు మండలాల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సుడిగాలి పర్యటన చేసి మృతుల కుటుంబాలను పరామర్శించారు.
ఉదయం కేవీబి పురం మండలం లోని సిద్దమనాయుడు కండ్రిగ కు ఎమ్మెల్యే చేరుకొని మృతి చెందిన మునిరాజమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మృతురాలు ముని రాజమ్మ చిత్ర పటానికి ఎమ్మెల్యే పుష్పాంజలి ఘటించారు.
అక్కడ నుండి వరదయ్య పాలెం మండలం తొడంబట్టి గ్రామానికి చేరుకుని పుష్పమ్మ చిత్ర పటానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అక్కడ నుండి కడూరు గ్రామానికి చేరుకుని మృతురాలు విమలమ్మ కుటుంబాన్ని పరామర్శించి, విమలమ్మ చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించారు.
చివరగా గుడవారి పాలెం గ్రామానికి చేరుకుని స్వర్ణమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమాల్లో వరదయ్య పాలెం, కేవీబి పురం మండలాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
