
2025-26 మొదటి త్రై మాసానికి ఎం జి ఎన్ ఆర్ జి ఎస్ కింద 5 ప్రాధాన్యత..
కూలీలకు పని కల్పించి గ్రామంలోని సహజ వనరులను అభివృద్ధి చేయడమే ముఖ్య లక్ష్యం:
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి/గరుడ ధాత్రి/ఏప్రిల్ 08:
మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలునందు జరిగిన జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రై మాసానికి సంబందించి ఎం జి ఎన్ ఆర్ జి ఎస్ కింద 5 ప్రాధాన్యత పనులను ఏప్రిల్,మే మరియు జూన్ నెలలో కూలీలకు పని కల్పించి గ్రామంలోని సహజ వనరులను అభివృద్ధి చేయడమే ముఖ్య లక్ష్యం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రధానంగా ఫారం పాండ్ల నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణం. ఎస్ సి, ఎస్ టి హ్యాబిటేషన్స్ లో వంద శాతం సిసి రోడ్ల నిర్మాణానికి చర్యలు అలాగే ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో స్మశాన వాటిక లేని చోట స్థలమును గుర్తించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
అలాగే జిల్లాలో ఈ వేసవిలో పశువులకు 1684 నీటి తోట్టి లను నిర్మించి పశువుల దాహం తీర్చడం జరుగుతుంది అన్నారు
ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి భూగర్భ నీటి మట్టం పెంపుకు చర్యల నిమిత్తం రైతులకు వారి పొలంలో ఇంకుడు గుంటలను తోవ్వడం జరుగుతుందని తెలిపారు.
చెరువులను, కుంటలను 2000 పైగా పూడిక తీసి అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు.
1800 పైగా చెరువులకు వచ్చే కాలువలను అలాగే పొలాలకు వెళ్లే కాలువలను పూడిక తీసి రాబోవు వ్యవసాయానికి అనుకూలంగా మార్చడం జరుగుతుందని తెలిపారు
కూలీలకు ప్రతి దినం 300 రూపాయలకు తక్కువ లేకుండా వేతనం పొందేలా వారికి సమయం, స్థలాన్ని మార్కింగ్ చేసి పని కల్పించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
జిల్లాలోని ప్రతి గ్రామములో పని కల్పించాలని అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించవలసిన బాధ్యత మనదే అని అన్నారు.
ముఖ్యంగా ఈ వేసవిలో సుమారుగా లక్ష మందికి పైగా ఉపాధి హామీ కింద పని కల్పించాలని ఆదేశించారు.
పీల్డ్ అసిస్టెంట్ లు ఎస్ సి, ఎస్ టి గ్రామాలలో కి వెళ్లి ప్రజలకు ఈ నరేగా పనులు లపై సదస్సులు ఏర్పాటు చేసి పూర్తిగా అవగాహనా కల్పించి పని కల్పించాలని తెలిపారు.
ఏ పి ఓ లు, ఏ పి డి లు, ఈ సి లు విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు
ఈ సమావేశంలో డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, మండల స్థాయిలో ఎమ్ పి డి ఓ లు,ఏ పి ఓ లు, ఏ పి డి లు, ఈ సి లు తదితరులు పాల్గొన్నారు.
