
*మహిళా సాధికారత దిశగా చంద్రన్న ప్రభుత్వం అడుగులు*
✍️ *30 ఏళ్లకు ముందే డ్వాక్రా గ్రూపులు ఏర్పాటుకు చంద్రన్న శ్రీకారం*
✍️ *అదే ప్రస్తుతం మహిళల ఎదుగుదలకు కీలకమైయ్యింది*
✍️ *పిచ్చాటూరు మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
మహిళా సాధికారత దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు.
శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పిచ్చాటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో మహిళలను ఘనంగా సత్కరించి, స్వీట్లు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితమే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మహిళల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారన్నారు.
ప్రస్తుతం ఆ డ్వాక్రా సంఘాలు ప్రతి సామాన్య మహిళకు ఆర్థిక ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే కొనియాడారు.
మహిళా దినోత్సవం కానుకగా రాష్ట్రంలోని అంగన్వాడి అక్కచెల్లెమ్మల రిటైర్మెంట్ వయసును 62 కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి దక్కిందన్నారు.
అలాగే మహిళల భద్రత ను దృష్టిలో ఉంచుకొని మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నేతృత్వంలో రూపుదిద్దుకున్న ‘శక్తి’ ఆప్ ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం విశేషమన్నారు.
అలాగే మహిళలు, పురుషులకు సమానంగా అన్ని రంగాలలో విశేష ప్రతిభను కనబరిచి రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
అనంతరం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళలను గజమాలతో సన్మానించి, స్వీట్లు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డీ ఇలంగోవన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పద్దు రాజు, వాసు రెడ్డి, దొరవేల్ రెడ్డి, చిన్నా, ఢిల్లీ బాబు, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

