
*వేసవికాలంలో ప్రజలకు త్రాగునీరు అందించాలని అసెంబ్లీలో మాట్లాడుతున్న శాసనసభ్యులు నల్లారి.*
అమరావతి : వైసీపీ ప్రభుత్వంలో మినరల్ గ్రాంట్స్ పేరుతో ఎంపీ లాండ్స్ కింద ప్రజలకు సౌకర్యంగా త్రాగు నీరు అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా వాటర్ ఫ్లాంట్స్ అమలు చేశారని,దానికి సంబంధించి మరమ్మతులు చేయటం, వాటికి మెయింటి నెన్స్ చేసే పరిస్థితి లేదని అక్కడ పనిచేసే వాటర్ మేన్ లకు కనీసం వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదని
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సంబంధిత మంత్రులకు అసెంబ్లీలో విన్నవించారు.
అందులో భాగంగా పీలేరు పట్టణంలో కూడా 23 వాటర్ ప్లాంట్ లు ఉన్నాయని ప్రస్తుతం ఈ ప్లాంట్స్ లో పని చేస్తున్న సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు లేవని ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ అధికారులకు బాధ్యతలు ఇచ్చి వారికి వేతనాలు ఇవ్వాలని సంబంధిత శాఖ మంత్రి వర్గాన్ని కోరారు.ఇదే విషయాన్ని పరిశీలించి వాటర్ మాన్ లకు వేతనాలు ఇచ్చేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలని, ప్లాంట్ లో ఫిల్టర్లు మార్చడానికి నిధులు కేటాయించాలని, అందరికి శుద్ధినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా నెరవేరాలంటే వాటర్ ప్లాంట్ లో ఫిల్టర్లు మార్చి అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని కోరుతున్నాము.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొందని, ప్రజలకు సౌకర్యంగా త్రాగునీరు అందించడానికి బాధ్యతలు పంచాయతీ శాఖకు అప్పజెప్పాలని అలాగే వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీరుకు ఇబ్బంది పడతారని అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరైన సమయానికి త్రాగునీరు అందించి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. దాంతో స్పందించిన మంత్రి వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి దీని మీద తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

