
నేడు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమాటిక్స్ పేపర్ -IA, బాటనీ పేపర్ -I, సివిక్స్ పేపర్ -I మరియు ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 33,228 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ*
*తిరుపతి, మార్చి 06 :* జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 33,228 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 జనరల్, 15 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మ్యాథమాటిక్స్ పేపర్ -IA, బాటనీ పేపర్ -I, సివిక్స్ పేపర్ -I మరియు ఒకేషనల్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు జనరల్ 32,830 మంది, ఒకేషనల్లో 1,341 మంది మొత్తం 34,171 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా జనరల్లో 849 , ఒకేషనల్లో 94 మంది, మొత్తం 943 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో త్రాగు నీటి వసతి, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపు,సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షణ, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సౌకర్యం కల్పించామని ఆర్.ఐ ఓ ప్రకటనలొ తెలిపారు

