
*పిచ్చాటూరు తహసీల్దారు గా టీవీ సుబ్రమణ్యం భాద్యతలు*
పిచ్చాటూరు మండలం తహసిల్దారుగా టీవీ సుబ్రహ్మణ్యం గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
తిరుపతి కలెక్టర్ నుండి ఆయన బదిలీపై పిచ్చాటూరు తహసిల్దార్ కార్యాలయానికి వచ్చారు.
గతంలో ఆయన పిచ్చాటూరులో తహసిల్దార్ గా పనిచేసిన అనుభవం ఉంది.
టీవీ సుబ్రమణ్యం తహసిల్దారుగా పిచ్చాటూరుకు రావడం పట్ల కార్యాలయ సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన టీవీ సుబ్రమణ్యం మండలంలోని అందరి సహకారంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

