
*నాగలాపురం లైన్ మ్యాన్ శరవణ కు ప్రశంసా పత్రం*
నేడు లైన్మెన్ దినోత్సవం సందర్భంగా నాగలాపురంలో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న జి.శరవణకు ప్రశంసా పత్రం లభించింది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించినందుకు ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ దేవ ఆశీర్వాదం, నాగలాపురం డీఈఈ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

