Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

త్వరలో ఏపీలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ….

*త్వరలో ఏపీలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..* రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంఅభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకేంద్రంతో రాష్ట్ర అభివృద్ధిపై చర్చిస్తున్న విషయం తెలిసిందే.గత వైసీపీప్రభుత్వంలో అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు మణిహారం లాంటి గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రం రూపుదిద్దుకోనుంది. సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్టును పట్టాలెక్కించారు.

 

ఇటీవల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ఢిల్లీ వెళ్లినప్పుడు రక్షణమంత్రితో ఈ ప్రాజెక్టు పై చర్చించారు. గత అక్టోబర్‌లో ప్రధాని మోడీ నేతృత్వంలోని భద్రతా కమిటీ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద లో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు ప్రధాని మోడీ రానున్నారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం డీఆర్‌డీఓ రూ.15-20వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా, శంకుస్థాపనకు తానే వస్తానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు తెలుస్తోంది.

 

Related posts

ఏపీలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం, లబ్ధిదారుల ఖాతాల్లో రూ.436 కోట్లు జమ

Garuda Telugu News

తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యునిగా చిత్తూరు ఎంపి శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు నియామకం….

Garuda Telugu News

కానిస్టేబుళ్ళ ఎంపిక ప్రక్రియలో రెండవ రోజు కొనసాగిన పరీక్షలు

Garuda Telugu News

Leave a Comment